విశాఖపట్నం జిల్లా పాడేరు పరిసరాల్లో... కరోనా కారణంగా అత్యవసర వైద్యం అవసరమైన వారిని పాడేరు ఆస్పత్రిలో వెంటిలేటర్ కనెక్టర్స్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. రాత్రి వేళలో ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతున్న పరిస్థితుల్లో.. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక వైద్య సిబ్బంది చరవాణి లైట్ల సహాయంతో వైద్యం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయంపై అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని రోగులు, సహాయకులు కోరుతున్నారు.
ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం... ఇబ్బందుల్లో రోగులు - paderu hospital latest news
విశాఖ జిల్లా పాడేరు ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అంతరాయం కారణంగా... రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
చరవాణి లైట్ల సహాయంతో వైద్యం