విశాఖపట్నంలోని గాజువాక అగనంపూడి దగ్గర టోల్గేట్ పునఃప్రారంభం విషయంలో మాజీ ఎమ్మేల్యే పల్లా శ్రీనివాసురావు విమర్శించడం విడ్డూరంగా వుందని ఎమ్మేల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఆగనంపూడి వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...టోల్గేట్ తెరిచే విషయంలో వైసీపీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని...టోల్గేట్ మూసివేతకు పోరాటం చేయటానికి సిద్ధమని ఎమ్మెల్యే నాగిరెడ్డి అన్నారు.
టోల్గేట్ మూసివేతకు పోరాటం చేస్తామన్న ఎమ్మెల్యే నాగిరెడ్డి - mla nagireddy
విశాఖ జిల్లాలోని గాజువాకలో స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. టోల్గేట్ విషయంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ విమర్శించడం సరికాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
టోల్ గేటు పునఃప్రారంభం విషయంలో విమర్శలు సరికాదన్న ఎమ్మేల్యే నాగిరెడ్డి
ఇది చూడండి: అల్లువారి రాముడు.. గ్రీకు దేవుడా..?