విశాఖ జిల్లా అనకాపల్లిలో సీపీఎం కార్యాలయంలో దేశవ్యాప్త ఆందోళనకు సంబంధించిన గోడ పత్రికను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తూ... ప్రజావ్యతిరేక విధానాలను పాటిస్తుందని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. భాజపా ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 20 నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలకృష్ణ, గంటా శ్రీరామ్ పేర్కొన్నారు.
దేశవ్యాప్త ఆందోళన గోడ పత్రికను ఆవిష్కరించిన సీపీఎం
దేశవ్యాప్త ఆందోళనకు సంబంధించిన గోడ పత్రికను అనకాపల్లి పార్టీ కార్యాలయంలో సీపీఎం నాయకులు ఆవిష్కరించారు. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ.. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపడతామని వివరించారు.
అనకాపల్లిలో సీపీఎం పార్టీ కార్యాలయంలో గోడ పత్రిక ఆవిష్కరణ