కరోనా కష్ట కాలంలో ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల నగదు, 10 కేజీల బియ్యం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పరాజు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణ పట్ల అనుసరిస్తున్న తీరుకు నిరసనగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్ర తీరంలో జల దీక్ష చేపట్టారు. కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తక్షణమే ప్రజల ప్రాణాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సీపీఎం జలదీక్ష - విశాఖలో సీపీఎం నిరసన
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్ర తీరంలో సీపీఎం నేతలు జలదీక్ష చేశారు. కరోనా నివారణ చర్యల్లో కేంద్రప్రభుత్వం విఫలమైందన్నారు. తక్షణమే పేదలందరికీ 5 వేల నగదు, 10 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
cpm leaders protest aganist in central govt in visakha dst