ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ, కడప జిల్లాలో సీపీఎం నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ విశాఖ, కడప జిల్లాల్లో సీపీఎం నాయకులు వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

cpi leaders protest at kadapa and visakhapatnam districts against central government decisions
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో సీపీఐ నాయకుల ఆందోళన

By

Published : Aug 20, 2020, 6:58 PM IST

కార్మిక చట్టాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, గిరిజన సమస్యలు, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు తదితర విషయాల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ వారం పాటు సీపీఐ ఆందోళన చేపట్టింది. విశాఖ, కడప జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

విశాఖ జిల్లాలో...

మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమాలు జరిపారు. కార్మిక చట్టాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. గిరిజన సమస్యలు పరిష్కరించాలని, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెంచాలని, 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు.

కడప జిల్లాలో...

కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నా... కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని కాపాడడంలో విఫలమైందని నిరసిస్తూ సీపీఎం నాయకులు గురువారం నిరసన చేపట్టారు. రాయచోటి మండలం చెన్నముక్కపల్లె సచివాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై వారం పాటు నిరసనలు చేపడతామన్నారు.

కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో ప్రతి పేదకుటుంబానికి 6 నెలల పాటు రూ.7500 ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలని పేర్కొన్నారు. పరిశ్రమలు కుంటుపడిన నేపథ్యంలో ఉపాధి హామీ పథకం ఏడాది పొడవునా పేదలకు కల్పించాలని కోరారు.

కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్న కార్మిక ఉద్యోగులకు రక్షణ పరికరాలతో పాటు రూ.50 లక్షల బీమా ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రజలపై భారీ పన్ను వసూలు చేయడమే ధ్యేయంగా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

దేశవ్యాప్త ఆందోళన గోడ పత్రికను ఆవిష్కరించిన సీపీఎం

ABOUT THE AUTHOR

...view details