కరోనా కారణంగా ముస్లిం భౌతికదేహాల ఖననానికి చాలా చోట్ల అంగీకరించకపోవడం... హిందూ వాటికలో వాటిని దహనం చేయడం జరుగుతోంది. మత ఆచారానికి విరుద్ధంగా చేస్తున్నామన్న క్షోభ కుటుంబ సభ్యుల్లో ఉంటోంది. దీనిని గమనించిన న్యాయవాది ఎస్.కె.ఏ. హుస్సేన్... ఉన్నతాధికారులపై వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. విశాఖలో ముస్లింలకు అంత్యక్రియలకు సంబంధించి స్థానిక కమిటీలు స్థలం కేటాయించలేదని.... పైగా అడ్డుకున్నారని అందులో పేర్కొన్నారు.
హుస్సేన్ ఫిర్యాదుపై స్పందించిన వక్ఫ్ బోర్డు అన్ని కమిటీలకు సూచనలు చేస్తూ ఆదేశిలిచ్చింది. ప్రధానంగా కొవిడ్ మరణాలకు సంభందించి... ఎట్టిపరిస్థితుల్లోనూ తిరస్కరించడానికి వీల్లేదని వాటికి సంబంధించి ముస్లిం శ్మశాన వాటికలో స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా యంత్రాంగాలకు సూచించింది. ఈమేరకు సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు.