చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌పై విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా... కేజీహెచ్‌లో ప్రత్యేక వైద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. విదేశీ ప్రయాణీకులు వచ్చేందుకు వీలున్న విమాన, నౌకాశ్రయాల్లో సమాచారం కేంద్రం ఏర్పాటు చేశారు. న్యూమోనియా లక్షణాలతో బాధపడుతున్నవారికి వైద్యమందించేందుకు చర్యలు తీసుకున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. ఇంట్లో ఎవరికైనా దగ్గు, తలనొప్పి, జలుబు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే... వెంటనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు.
కరోనా వైరస్‌పై విశాఖ యంత్రాంగం అప్రమత్తం - కరోనా వైరస్ తాజా వార్తలు
కరోనా వైరస్‌పై విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కేజీహెచ్‌లో ప్రత్యేక వైద్య విభాగం, విమానాశ్రయంలో సమాచార కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. న్యూమోనియా లక్షణాలుంటే అప్రమత్తమవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.
khg