విశాఖ మహా నగర పాలక సంస్థ 93 వ వార్డు గోపాలపట్నానికి చెందిన మహిళకు కరోనా సోకింది. ఆమె కేజీహెచ్ లో విధులు నిర్వహించేవారు. ఆమె నివాసం ఉంటున్న.. అపార్ట్మెంట్లోని అందరికీ వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. జీవీఎంసీ, పోలీస్ సిబ్బంది.. ఆ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
గోపాలపట్నంలో మహిళకు కరోనా పాజిటివ్!
విశాఖ జిల్లా గోపాలపట్నంలో మహిళకు కరోనా సోకింది. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులందరికీ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.
గోపాలపట్నంలో మహిళకు కరోనా పాజిటీవ్