వైకాపా ముఖ్యనేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డికి కరోనా సోకింది. మంగళవారం పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. చికిత్స నిమిత్తం ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి లో చేరారు. దీనికి సంబంధించి ఆయన మంగళవారం ఒక ట్వీట్ చేశారు. .." కోవిడ్ పరిస్థితులు కారణంగా.. జాగ్రత్త కోసం నా అంతట నేను వారం పదిరోజుల పాటు క్వారంటెన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను . అత్యవసరం అయితే తప్ప.. ఫోన్ లో కూడా అందుబాటులో ఉండను". అని ట్వీట్ చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!
కరోనా పరిస్థితుల కారణంగా తాను 10 రోజుల వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్టు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ సమయంలో టెలిఫోన్లో కూడా అందుబాటులో ఉండనని వెల్లడించారు.
ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా
Last Updated : Jul 22, 2020, 10:17 AM IST