విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో కరోనా కేసులు ఉధృతం అవుతున్నాయి. ఒక నియోజకవర్గంలోనే సుమారు 175 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడి చేశారు. నర్సీపట్నం పట్టణానికి సంబంధించి ఇప్పటికే 35 కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మిగతా వాటికి సంబంధించి గొలుగొండ, కొయ్యూరు,రావికమతం తదితర మండలాల్లో కొత్తగా 11 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో ఒక్క రోజు సుమారు 35 కేసులకు పైగా అధికారులు గుర్తించారు. నర్సీపట్నం పట్టణంలో సుమారు పదిహేను రోజులుగా పాక్షిక లాక్డౌన్ కొనసాగుతుంది. దీనికితోడు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలను కట్టడి చేసి అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.
నర్సీపట్నంలో కరోనా ఉద్ధృతి - corona virus news in narsipatnam
విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఈ నియోజకవర్గంలో సూమారుగా 175 కేసులు నమోదైనట్లు తెలిపారు. వైరస్ విజృంభణ నేపథ్యంలో పదిహేను రోజులుగా లాక్ డౌన్‌ను కొనసాగుతుంది. మహమ్మారి విస్తరిస్తోన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలను ప్రారంభించాారు.
నర్సీపట్నంలో కరోనా ఉద్ధృతి