విశాఖ జిల్లా అనకాపల్లిలో తాజాగా మరో 8 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా పాజిటివ్ కేసుల్లో పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. విశాఖలో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన విజయరామరాజుపేట చెందిన యువకుడికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93కు చేరింది. గవరపాలెంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. పట్టణంలో ఇప్పటివరకు 28 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ఒక్క గవరపాలెంలోనే 20 ఉన్నాయి.
అనకాపల్లిలో తాజాగా 8 కరోనా కేసులు నమోదు - అనకాపల్లిలో కరోనా కేసులు
విశాఖ జిల్లా అనకాపల్లిలో తాజాగా మరో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93కు చేరింది. వైరస్ వ్యాప్తితో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
అనకాపల్లిలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న సిబ్బంది