విశాఖ జిల్లా అనకాపల్లిలో తాజాగా 30మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణయ్యింది. అనకాపల్లికి చెందిన ఒక వృద్దుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే అతడిని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహానికి కరోనా పరీక్ష చేయగా... పాజిటివ్ అని తేలటంతో ఆసుపత్రి సిబ్బంది ఆ మృత దేహాన్ని జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందజేశారు. అనకాపల్లిలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుండటంతో స్థానికులు అందోళనకు గురవుతున్నారు.
విజృంభిస్తున్న కరోనా... అనకాపల్లిలో మరో 30మందికి వైరస్ - corona latest news
విశాఖ జిల్లా అనకాపల్లిలో కొత్తగా 30మందికి కరోనా సోకింది. అనకాపల్లికి చెందిన వృద్దుడు అనారోగ్యంతో ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.
అనకాపల్లిలో కొత్తగా 30కరోనా పాజిటివ్ కేసులు నమోదు