ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజగృహపై దాడిని ఖండిస్తూ.. అనకాపల్లిలో కాంగ్రెస్​ ఆందోళన - attack on rajagruha at maharastra news update

విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని రాజగృహపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు.

congress protest at anakapalli
రాజగృహపై దాడిని ఖండిస్తూ అనకాపల్లిలో కాంగ్రెస్​ ఆందోళన

By

Published : Jul 15, 2020, 5:10 PM IST

మహారాష్ట్రలోని రాజగృహపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. దేశంలో మతోన్మాద శక్తుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. రాజగృహ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్, నూక అప్పారావు, సంతోష్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

ఫార్మాసిటీ ప్రమాద ఘటన బాధితులను పరామర్శించిన విజయసాయి రెడ్డి

ABOUT THE AUTHOR

...view details