ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి: సీఐటీయూ - సీఐటీయూ తాజా వార్తలు

ఇసుక, సిమెంటు ధరలు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో విశాఖ ఇసుకతోట కూడలిలో భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు.

citu protest for built workers
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ ధర్నా

By

Published : Jun 8, 2020, 7:36 PM IST

కరోనా లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికీ 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్ఎస్​కెవి కుమార్ డిమాండ్ చేశారు. ఇసుక ధరలు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్నారు.

భవన నిర్మాణ పనులు తిరిగి పుంజుకునే వరకు కేరళ రాష్ట్ర తరహాలో 17 రకాల నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లతో పాటు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వి కృష్ణారావు, కే. కుమారి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details