ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

10 రూపాయలు ఆశ చూపారు.. 55 వేలు కొట్టేశారు

నగదు డిపాజిట్ చేద్దామని ఫారం నింపుతున్న వ్యక్తి దగ్గరకొచ్చారు. 10 రూపాయల నోట్లు కింద పడేశారు. మీవేనేమో చూసుకోండి అని ఆశ చూపారు క్షణాల్లో మాయ చేసి 55 వేల రూపాయలు కొట్టేశారు. పరారయ్యారు.

10 రూపాయల ఆశ చూపించి 55 వేలు కొట్టేశారు

By

Published : Aug 13, 2019, 8:37 PM IST

10 రూపాయల ఆశ చూపించి 55 వేలు కొట్టేశారు

నగదును డిపాజిట్ చేసేందుకు వచ్చిన ప్రైవేట్ వ్యాపారి ఏడుకొండలు నుంచి దృష్టి మరల్చి 55 వేల నగదును ఆగంతకులు అపహరించిన ఘటన విశాఖ జిల్లా గాజువాకలోని ఆంధ్రా బ్యాంక్ శాఖలో చోటు చేసుకుంది. నగదు బ్యాగ్ ను పక్కన పెట్టుకుని ఫారం నింపుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు కలసి పక్కా ప్రణాళిక ప్రకారం బ్యాంకులోకి వచ్చారు. అందులో ఒకరు 10 రూపాయ నోట్లు అతనికి కొంచెం దూరంలో వేసి అతని దగ్గరికి వెళ్లాడు. ''మీ నగదు కింద పడిపోయింది చూసుకోండి'' అని చెప్పి వెళ్లిపోయాడు. పది రూపాయల నోట్లను తీసుకునేందుకు ఏడుకొండలు కిందకు చూడగా.. అంతలోనే మిగిలిన ఇద్దరు డబ్బు సంచితో ఉడాయించారు. పది రూపాయల నోట్లు తీసుకుని లేచి చూడగా.. తన డబ్బు సంచి మాయమైనట్టు బాధితుడు గుర్తించాడు. గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలో దృశ్యాల ఆధారంగా... దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. బ్యాంకుల్లో జాగ్రత్తగా లేకుంటే.. పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం.. ఈ ఘటనతో మరోసారి రుజువైంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details