కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన ప్రకటన చేయాలని... మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆసుపత్రులను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రక్తపరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన కార్యాచరణను వెల్లడించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు, వ్యవసాయ ఉత్పత్తులు చేసే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'ప్రభుత్వం కచ్చితమైన ప్రకటన చేయాలి' - చింతకాయల అయ్యన్నపాత్రుడు
రాష్ట్రంలో ఆసుపత్రులను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
TAGGED:
చింతకాయల అయ్యన్నపాత్రుడు