విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం బలిపురం గిరిజన గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు.. పది రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. కొన్ని రోజుల క్రితం కాకర కుమార్ (4) మృతి చెందగా.. తాజాగా 7 నెలల బాలుడు ప్రాణం విడిచాడు.
ఆరోగ్యంగా ఉన్న ఆ పిల్లలు ఉన్నఫళంగా మరణిస్తుండడం.. గ్రామస్థులను కలవరపరుస్తోంది. ఘటనకు కారణాలపై విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న డిమాండ్ చేశారు. గిరిజనులకు సరైన వైద్య సేవలు అందించాలని కోరారు.