న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదనీ.. అంకితభావంతో నిర్వర్తించి బాధితులకు సత్వర న్యాయం అందించేలా న్యాయవాదులు దృష్టి సారించాలని.. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇటీవల మృతి చెందిన విశాఖ జిల్లా అనకాపల్లి కోర్టులో పనిచేస్తున్న సీనియర్ న్యాయవాది పీ.ఎస్. కుమార్ పేరు మీద ఏర్పాటుచేసిన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. బార్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాదులు అడపా లక్ష్మణరావు, బుద్ధ సత్యనారాయణ, డీ. చలపతిరావు తదితరులు పీఎస్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి జూనియర్ న్యాయవాది సీనియర్ న్యాయవాది వద్ద కచ్చితంగా తగిన శిక్షణ పొందాలని సూచించారు. దీనివల్ల కోర్ట్ బెంచ్ వద్ద ఎలా వ్యవహరించాలన్న దానిపై అవగాహన వస్తుందన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నారు.
'న్యాయవాది వృత్తి పవిత్రమైంది.. అంకితభావంతో నిర్వర్తించాలి' - అనకాపల్లి
న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదనీ.. దీన్ని అంకితభావంతో నిర్వర్తించి బాధితులకు సత్వర న్యాయం అందించేలా న్యాయవాదులు దృష్టి సారించాలని.. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నారు.
చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్
ఇవీ చదవండి..