కరోనా వ్యాప్తి దృష్ట్యా విశాఖ శ్రీ శారదాపీఠం దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం పూట భక్తుల రాకపోకలను పూర్తిగా నిలిపివేయగా... సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని పీఠం ఓ ప్రకటనలో తెలిపింది. శారదా పీఠంలోని ఆలయాల్లో నిత్యపూజలు, కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నిబంధనలను భక్తులందరూ పాటించాలని కోరారు.
విశాఖ శ్రీ శారదా పీఠం దర్శనవేళల్లో మార్పులు - vishakha sharadha peetham corna effect
కరోనా కారణంగా విశాఖ శ్రీ శారదాపీఠం దర్శన సమయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం పూట భక్తులకు దర్శనాన్ని నిలిపివేసిన పీఠం అధికారులు.. పరిమిత వేళల్లోనే దర్శనానికి అనుమతివ్వాలని నిర్ణయించారు.
విశాఖ శ్రీ శారదా పీఠం దర్శన వేళల్లో మార్పులు