మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌లు సంతాపం ప్రకటించారు. పెన్మత్స కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు, విలువలకు మారుపేరుగా సాంబశివరాజు నిలుస్తారని చంద్రబాబు కొనియాడారు. ఆయన మృతి బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. రాజకీయాలలో ఉన్నత విలువలు నెలకొల్పి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటేనే ఆయన పట్ల ప్రజలు ఎంత ఆదరాభిమానాలు చూపించారో అర్థం అవుతోందన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబసభ్యులకు లోకేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
రాజకీయాలలో పెన్మత్స ఉన్నత విలువలు నెలకొల్పారు: చంద్రబాబు - పెన్మత్స సాంబశివరాజు మృతిపట్ల చంద్రబాబు సంతాపం
మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌లు సంతాపం ప్రకటించారు. రాజకీయాలలో ఉన్నత విలువలు నెలకొల్పి, మచ్చలేని నాయకుడిగా వెలుగొందారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చంద్రబాబు