Simhadri Appanna: వైశాఖ పూర్ణిమను పురస్కరించుకుని.. సింహాద్రి అప్పన్నకు ఇవాళ రెండో విడత చందన సమర్పణ వైభవంగా జరిగింది. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సుప్రభాత సేవతో చందనోత్సవం ప్రారంభమైంది. విశ్వక్షేణ ఆరాధనం, పుణ్యాహవచనం అనంతరం... స్వామివారికి చందన సమర్పణ ఉత్సవం నిర్వహించారు. చందనోత్సవం సందర్భంగా.. ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. పుణ్యదినం సందర్భంగా.. మత్స్యకారులు, భక్తులు.. సాము గరిడీలు, సంకీర్తనలతో.. స్వామివారికి భక్తి సమర్పణ చేసుకున్నారు.
సింహాద్రి అప్పన్నకు వైభవంగా.. రెండో విడత చందన సమర్పణ
Simhadri Appanna: వైశాఖ పూర్ణిమను పురస్కరించుకుని.. సింహాద్రి అప్పన్నకు ఇవాళ రెండో విడత చందన సమర్పణ వైభవంగా జరిగింది. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సుప్రభాత సేవతో చందనోత్సవం ప్రారంభమైంది. రెండో విడత చందన సమర్పణలో భాగంగా... మూడు రోజుల పాటు అరగదీసిన 125 కిలోల చందనాన్ని.. స్వామివారికి సమర్పించారు.
సింహాద్రి అప్పన్నకు వైభవంగా రెండో విడత చందన సమర్పణ
రెండో విడత చందన సమర్పణలో భాగంగా.. మూడు రోజుల పాటు అరగదీసిన125 కిలోల చందనాన్ని.. స్వామివారికి సమర్పించారు. అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా.. గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు.. స్వామివారి దర్శనానికి పోటెత్తారు. స్వామివారిని కీర్తిస్తూ.. దర్శనం చేసుకుని పులకించిపోయారు.
ఇదీ చదవండి: