విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పీఠంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఒడిశా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నబాకిషోర్ దాస్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, భాజపా ఎమ్మెల్సీ మాధవ్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు పీఠాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర చేతులమీదుగా సాగే శారదా స్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరుల పీఠపూజను తిలకించారు. పీఠార్చన తీర్థం పుచ్చుకుని స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు.
విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన ప్రముఖులు - vishakha sharada peetam annivarsary celebrations
విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పీఠార్చన తీర్థం పుచ్చుకుని స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు.
విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన ప్రముఖులు