మత్తు వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ అధికారులు మరోసారి నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని కీలకమైన రికార్డులను పరిశీలించారు. ఇదే ఆస్పత్రిలో మత్తు వైద్యునిగా పనిచేసిన సుధాకర్...కరోనా రక్షణ కవచాలు లేవంటూ బాహాటంగా విమర్శించడంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత విశాఖలో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం ఆయన్ను మానసిక వైద్యశాలకు తరలించగా...హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. అందులో భాగంగానే సీబీఐ అధికారులు రికార్డులు పరిశీలించారు
వైద్యుడు సుధాకర్ కేసులో రికార్డులు పరిశీలించిన సీబీఐ - doctor sudhakar case news
వైద్యుడు సుధాకర్ కేసు విషయమై విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిని సీబీఐ అధికారులు సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు.
వైద్యుడు సుధాకర్ కేసులో రికార్డులు పరిశీలించిన సీబీఐ