ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ వైద్యుడు సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు

విశాఖ డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల విశాఖపట్నంలోని జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారని సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని సుధాకర్‌ ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు సుధాకర్‌ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆదేశించింది.

cbi case on doctor sudhakar
cbi case on doctor sudhakar

By

Published : Jun 3, 2020, 1:11 PM IST

హైకోర్టు ఆదేశంతో విశాఖ వైద్యుడు సుధాకర్ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నిన్నసుధాకర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇవాళ సీబీఐ వెబ్​సైట్​లో ఎఫ్‌ఐఆర్‌ కాపీని అధికారులు ఉంచారు. కానిస్టేబుల్‌ బెలగల వెంకటరమణ ఫిర్యాదు ఆధారంగా.. విధులకు ఆటంకం కలిగించారనే అంశంపై కేసు నమోదు చేశారు. గత నెల 16న సుధాకర్‌పై కేసు నమోదు చేసిన నాలుగో పట్టణ పోలీసులు 353, 427, 506 సెక్షన్ల కింద నాలుగో పట్టణ పీఎస్‌లో కేసు పెట్టారు. అప్పటి ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ప్రస్తుతం కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశానుసారం కేసులు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details