అక్రమంగా భారీ మొత్తంలో నగదును హవాలా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 38 లక్షల 76వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న నగదు
By
Published : Apr 2, 2019, 11:19 PM IST
స్వాధీనం చేసుకున్న నగదు
అక్రమంగా భారీ మొత్తంలో నగదును హవాలా రూపంలో చలామణీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ద్వారకానగర్ లోని ఓ అపార్ట్మెంట్లో 38 లక్షల 76వేల నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అందించనున్నట్లు పోలీసులు తెలిపారు.