గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పరిధిలోని సుజాత్ నగర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఆటోలో జి.మాడుగుల మండలం మధ్యగరువు నుంచి నగరానికి గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పెందుర్తి సీఐ సత్యనారాయణ తెలిపారు. 256 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నామన్నారు. సేతి రాములు, కుమ్మరి గంగాధర్ల అనే ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
256 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - నిషేదిత గంజాయి రవాణా...ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
విశాఖ జిల్లాలోని పెందుర్తిలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 256 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పెందుర్తిలో నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
Last Updated : Jan 5, 2020, 1:07 PM IST
TAGGED:
illegally cannibes export