విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో క్యాన్సర్ బ్లాక్‌ను కొవిడ్ ఆసుపత్రిగా మలిచారు. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. 500 పడకలతో ఏర్పాటైన ఈ విభాగంలో తొలిరోజు 25 మంది కొవిడ్ బాధితులు చేరారు. వైద్యులు, నర్సులు, సిబ్బందికి పీపీఈ కిట్లు, ఇతర రక్షణ పరికరాలను ఆసుపత్రి వర్గాలు సమకూర్చాయి. బ్లాక్‌కి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించే విధంగా 20 కిలో లీటర్ల సామర్ధ్యం ఉన్న ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు.
కొవిడ్ ఆసుపత్రిగా విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి క్యాన్సర్ బ్లాక్ - visakha king george hospital
విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో క్యాన్సర్ బ్లాక్‌ను కొవిడ్ ఆసుపత్రిగా మలిచారు. 550 బెడ్లను కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేశారు. బ్లాక్‌కి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించే విధంగా 20 కిలో లీటర్ల సామర్ధ్యం ఉన్న ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు.
కొవిడ్ బారిన పడ్డ 29ఏళ్ల గర్భిణికి ఆసుపత్రి ప్రసూతి విభాగ వైద్యాధికారులు శస్త్రచికిత్స చేసి ప్రసవం చేయించారని ఏఎంసీ ప్రిన్సిపల్, ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. కొవిడ్ బాధితులు నేరుగా ఆసుపత్రి వద్దకు వస్తే రికార్డులు పరిశీలించి చేర్చుకుంటామని, 24గంటలు నిరంతరాయంగా సేవలందిస్తామన్నారు. ప్రతి షిఫ్టులో 55 మంది వైద్యులు, అంతే సంఖ్యలో నర్సులు అందుబాటులో ఉంటారు. రోగుల భోజన ఖర్చుల కింద ఒక్కొక్కరిపై రోజుకు రూ.500 ఖర్చు చేస్తున్నారు. ఏపీటీడీసీ నుంచి కొవిడ్ ఆసుపత్రులకు ఆహారం సరఫరా అవుతుంది.
ఇదీ చూడండి.వారాంతంలో విశాఖ బీచ్‌లలో కోలాహలం