ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వంతెనలు శిథిలం .. ఆందోళనలో వాహన చోదకులు

విశాఖ జిల్లాలో పలు చోట్ల వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాహనదారులు బిక్కుబిక్కు మంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

vishakha bridges news
విశాఖ జిల్లాలో వంతెనలు శిథిలం

By

Published : May 27, 2021, 6:29 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం - నర్సీపట్నం రహదారిపై వంతెనలు శిథిలావస్థకు చేరడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. భారీ వాహనాలు వంతెనలపై నుంచి వెళుతుండడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాల కాలం క్రితం నిర్మాణం...

గోవాడ , విజయరామరాజుపేట, వడ్డాది , కొత్తకోట, బాగాపురం తదితర ప్రాంతాల్లోని వంతెనలు చాలా కాలం క్రితం నిర్మించారు. ఎక్కడికక్కడే పెచ్చులూడి పోతుండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల నుంచి పరిమితికి మించిన బరువుతో వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయని సత్వరమే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

'టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం '

భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డు ఆధునీకరణకు తొలివిడతగా 70 కోట్లు మంజూరయ్యాయని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని ఈ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలిపారు.

ఇదీ చదవండి:విశాఖ ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి జేడీ ఫౌండేషన్ వితరణ

ABOUT THE AUTHOR

...view details