విశాఖ జిల్లా ఎన్టీపీసీ దీపాంజలి నగర్ టౌన్షిప్లోని పరవాడలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూపరులను ఆకర్షిస్తోంది. నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే బొమ్మల కొలువు సందడి ఈ ఏడాది బాగా తగ్గిపోయింది. కొవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే అథితులను ఆహ్వానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా బంధువులు, స్నేహితులకు చూపించి సంతృప్తి పడుతున్నారు.
రంగుల హరివిల్లులా.. బొమ్మల కొలువు - bommla koluvu
దసరా వేడుకల్లో భాగంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం సంప్రదాయం. కొంతమంది మహిళలు ఆనవాయితీగా దీన్ని కొనసాగిస్తున్నారు. కొవిడ్ కారణంగా ఈసారి పరిమితంగా నిర్వహిస్తున్నారు.
బొమ్మల కొలువు