పడవ బోల్తా పడి మత్స్యకారుడు గల్లంతు..పోలీసుల గాలింపు - boat capsized and the fisherman capsized
పాయకరావుపేట మండలం పెంటకోట సముద్ర తీరంలో పడవ బోల్తా పడిన సంఘటనలో మత్స్యకారుడు గల్లంతయ్యాడు. గల్లంతైన మత్స్యకారుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పడవ బోల్తా పడి మత్స్యకారుడు గల్లంతు..పోలీసుల గాలింపు చర్యలు
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట సముద్ర తీరంలో పడవ బోల్తా పడిన సంఘటనలో మత్స్యకారుడు గల్లంతయ్యాడు. ఉదయాన్నే ఆరుగురు మత్స్యకారులు చేపల వేటకు సముద్రానికి బయలు దేరారు. కొంత దూరం ప్రయాణించే సరికి కెరటాల తాకిడికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గల్లంతు కాగా... మిగిలిన ఐదు గురు మత్స్యకారులు సముద్రంలో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన మత్స్యకారుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.