ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో.. పెరుగుతున్న బ్లాక్‌ఫంగస్‌ కేసులు

రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకూ 20 కేసులు గుర్తించగా కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి వ్యాధి నిర్ధరణ అయ్యింది. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చే కోటాను మించి అదనంగా ఔషధాలు సమకూర్చుకుంటోంది.

black-fungus-cases-increased-in-andhrapradhesh
రాష్ట్రంలో పెరుగుతున్న బ్లాక్‌ఫంగస్‌ కేసులు

By

Published : May 20, 2021, 6:47 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు బ్లాక్‌ఫంగస్‌ కేసులు క్రమంగా పెరగడం గుబులురేపుతోంది. కర్నూలు జిల్లాలో ఈ మధ్యే ఇద్దరు బ్లాక్‌ఫంగస్‌తో చనిపోగా మరో ఇద్దరు ఈ వ్యాధి బారినపడ్డారు. తాజాగా మంత్రాలయానికి చెందిన మహిళకు, ముచ్చగిరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరభద్రాచారికి బ్లాక్‌ఫంగస్ సోకింది. వీరిద్దరూ కర్నూలులో చికిత్స పొందుతున్నారు. కృష్ణాజిల్లాలో ఇప్పటి దాకా 20 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు గుర్తించామని సంయుక్త కలెక్టర్ శివశంకర్ చెప్పారు.

బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు అవసరమైన యాంపోటెరిసిన్‌-బి ఇంజక్షన్లు మార్కెట్‌లో దొరకకపోవడం రోగుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోనూ దొరకడం కష్టంగా మారింది. ఈ ఇంజక్షన్ల కొనుగోలుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. కేంద్రం ఇచ్చే ఇంజక్షన్లకు తోడు అదనంగా సమకూర్చుకునేందుకు ఆయా ఔషధ తయరీ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. ప్రైవేటులో చికిత్స పొందే బ్లాక్‌ఫంగస్‌ రోగులకూ వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే ఇంజక్షన్ల సరఫరా చేయాలని భావిస్తున్నారు.

ఈ నెల 22,23 తేదీల్లో బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు ఇంజక్షన్ల సరఫరా మొదలవుతుందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ తెలిపారు. బ్లాక్‌ఫంగస్‌ చికిత్స ప్యాకేజీని నిర్ధరించి ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ఉత్తర్వులిచ్చామన్నారు. విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్ పేషెంట్ల చికిత్స కోసం కేజీహెచ్ డెర్మటాలజీ విభాగంలో 20 పడకలు కేటాయిస్తున్నామని కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

ఏనుగుల గుంపు బీభత్సం.. ఆందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details