విశాఖపట్నంలోని ఎన్ఏడీ ఫ్లై ఓవర్ ను భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరిశీలించారు. నగరానికి తలమానికంగా ఉండాలని నిర్మించిన ఈ వంతెనపై తరచూ ప్రమాదాలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వంతెనను గత పాలకులు అస్తవ్యస్తంగా నిర్మించారని ఎంపీ ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులతో చర్చించి పార్లమెంట్లో ప్రస్తావిస్తానని నరసింహారావు తెలిపారు.
ఎన్ఏడీ పై వంతెనను అస్తవ్యస్తంగా నిర్మించారు : ఎంపీ జీవీఎల్ - విశాఖ నేటి వార్తలు
విశాఖ నగరానికి తలమానికంగా భావించే ఎన్ఏడీ పై వంతెనను అస్తవ్యస్తంగా నిర్మించారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని వెల్లడించారు.
భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు