ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక ఎన్నికలకు సంసిద్ధమవ్వండి: ఎమ్మెల్సీ మాధవ్ - విశాఖ జిల్లా వార్తలు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అహగాహన కల్పించాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, పార్టీ విజయానికి అందరూ కలిసి పని చేయాలని ఆయన కోరారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో రెండ్రోజుల పాటు జరగనున్న సంస్థాగత, అసెంబ్లీ స్థాయి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.

mlc pv madhav
mlc pv madhav

By

Published : Nov 23, 2020, 3:49 PM IST

ప్రధాని మోదీ నాయకత్వంలో.. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని...వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని భాజపా నేత, ఎమ్మెల్సీ పీవీ మాధవ్ అన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలో రెండు రోజుల పాటు జరిగే సంస్థాగత, అసెంబ్లీ స్థాయి శిక్షణ తరగతులను ఎమ్మెల్సీ మాధవ్ ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మాధవ్ ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్ని కోరారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని... అందుకు అంతా సంసిద్ధతగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు గాదె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :తిరుపతి ఎంపీ స్థానాన్ని భాజపా కైవసం చేసుకుంటుంది: బాబుమోహన్

ABOUT THE AUTHOR

...view details