విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి భూములు ఆక్రమణకు గురయ్యాయని భాజపా నేతలు ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గం సింహాచలంలో ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. ఆక్రమణలకు గురైన భూములు గుర్తించి, వాటిని పరిశీలించిన అనంతరం రాష్ట్ర కార్యవర్గానికి రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. లాక్డౌన్ సమయంలో చాలావరకు స్వామివారి భూముల్లో నిర్మాణాలు జరిగాయని, చాలా భూముల్లో ఆక్రమణదారులు కంచె ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేయడమేకాక, చర్యలు చేపట్టే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
'అప్పన్న భూములని ఆక్రమిస్తున్నారు' - విశాఖ జిల్లా సింహాచలం తాజా వార్తలు
విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామి వారి భూములు ఆక్రమణకు గురయ్యాయని భాజపా నేతలు ఆరోపించారు. భాజపా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గం సింహాచలంలో ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భూములు పరిశీలించారు.

సింహాచలంలో భూములు పరిశీలించిన భాజపా నేతలు