స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, భాజపా కూటమి అభ్యర్థులను నియమించేలా ఎంపిక చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో పార్టీల బలానికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్లు ఇరు పార్టీల నాయకులు తెలిపారు. అన్ని స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలో దించేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మూడో ప్రత్యామ్నాయ కూటమిగా జనసేన, భాజపా కూటమి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయనున్నట్లు నాయకులు వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొమ్మిది నెలల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి మంచి మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి' - bjp, janacena latest news
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని భాజపా, జనసేన పార్టీ ముఖ్య నాయకులు నిర్ణయించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించారు.
అనకాపల్లిలో భాజపా, జనసేన పార్టీ నేతల సమావేశం