మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీతో పాటు జనసేన అభ్యర్థులను గెలిపించాలని.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కోరారు. స్థానిక సంస్థల అభివృద్ధికి.. ప్రస్తుత, గత ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదని విశాఖ జిల్లా అనకాపల్లిలో విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చూపిస్తూ.. ఖర్చు చేస్తున్నారన్నారని ఆరోపించారు.
ఉక్కు పరిశ్రమ ఎక్కడికీ పోదని సోము వీర్రాజు తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ నేతలు రాద్ధాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు. దేశం అభివృద్ధి చెందడం ఇష్టం లేనట్లుగా వారు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.