విశాఖలో కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల వికాస్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు ఎలా వ్యాపించింది, దీని నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ప్రసంగించారు. ఈ వ్యాధిగ్రస్థులు తుమ్మడం, దగ్గడం వల్ల దగ్గరలో ఉండే వ్యక్తులకు సులభంగా సోకుతుందన్నారు. అంతేకాకుండా వ్యాధిగ్రస్థులు వాడే చేతి రుమాలు, వారితో కరచాలనం చేయడం వంటివి చేయకూడదని తెలిపారు. తుమ్ములు, దగ్గు, అధిక జ్వరం ఉన్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
కరోనా వైరస్‌పై విశాఖలో అవగాహన సదస్సు - corona virus awareness programme in vizag
విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో కరోనా వైరస్‌పై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ఏఎమ్‌సీ ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ కరోనా వైరస్ ఎలా వ్యాపించిందనే అంశంపై మాట్లాడురు. దీని నివారణకు తీసుకావాల్సిన జాగ్రత్తలను తెలిపారు.
కరోనా వైరస్‌పై విశాఖలో అవగాహన సదస్సు