పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని విశాఖలో ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. వాహన మిత్ర పథకంలో భాగంగా అర్హులైన డ్రైవర్లకు రూ.పది వేలు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా మూడో ఏడాది రూ.10 వేలు ఆర్థిక సాయం అందించడం హర్షణీయమని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.