విశాఖ జిల్లా తూర్పు నౌకాదళ ప్రధానాధికారిగా వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. తూర్పు నౌకాదళ ఐఎన్ఎస్ సర్కార్స్ పరేడ్ మైదానంలో ప్రస్తుత ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి ఆయన బాధ్యతలను చేపట్టారు. తూర్పు నౌకాదళానికి సారథ్యం వహిస్తున్న వారిలో జైన్ 14వ వారు. 18 ప్లాటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
నౌకాదళ ప్రధాన అధికారి (నేవీ చీఫ్)గా కరం బీర్ సింగ్రేపు దిల్లీలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మాట్లాడుతూ.. తూర్పు నౌకాదళంలో పని చేయడం మంచి సంతృప్తినిచ్చిందన్నారు. హిందూ మహా సముద్రంలో శ్రీలంక నుంచి ఎదురవుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలనీ.. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.