ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 22, 2020, 9:48 AM IST

ETV Bharat / state

పాడేరులో ఆశా కార్యకర్తల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ

విశాఖ పాడేరు ఏజెన్సీలోని ఆశా కార్యకర్తల నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 25 లోగా దరఖాస్తులను జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అందించాలని అధికారులు ప్రకటించారు.

asha workers appointment started in paderu
పాడేరులో ఆశా కార్యకర్తల నియామకానికి ధరఖాస్తు స్వీకరణ

విశాఖ జిల్లా పాడేరు డివిజన్ పరిధిలో ఆశా కార్యకర్తలుగా పనిచేయడానికి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అదనపు వైద్యాధికారి లీలా ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 25 లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.

అర్హతలు:

1) మహిళ అభ్యర్థి గ్రామంలో నివసిస్తూ 25 -40 సంవత్సరాల వయసు కలిగి వివాహితులై ఉండాలి.

2) వితంతు, విడిపోయిన, విడాకులు పొందిన, నిరాశ్రయులైన మహిళలకు ప్రాధాన్యం.

3) 8వ తరగతి పాసై తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి.

4) ప్రభుత్వం, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన, చేస్తున్న వారికి ప్రాధాన్యం

అందజేయవలసిన ధ్రువ పత్రాలు:

1) నివాస ధ్రువపత్రం (రేషన్, ఓటర్, ఆధార్ కార్డు , బ్యాంకు పాస్ పుస్తకం)

2) 8వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్

3) ప్రభుత్వ, ప్రయివేటు స్వచ్ఛంద సంస్థలు నందు పనిచేసిన ధ్రువీకరణ పత్రం.

ఇదీ చదవండి:

తిరుమలలో వైభవంగా పుష్పయాగం

ABOUT THE AUTHOR

...view details