ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏవోబీలో మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు

మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం జ‌య‌ప్రదం చేయాల‌ని కోరుతూ మావోయిస్లులు ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో క‌ర‌ప‌త్రాల‌ను వెద‌జ‌ల్లారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసులు కూంబింగ్​ పనులు ముమ్మరం చేశారు.

ఏవోబీలో మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు

By

Published : Sep 21, 2019, 5:20 AM IST

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఈనెల 21న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం మావోలు జరుపుకోనున్నారు. దీంతో స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వ్యవస్థాపక దినోత్సవం నిర్వహిస్తున్నట్టు మావోయిస్టులు కటాప్ ప్రాంతాల్లో వారం రోజులు ముందు నుంచే కరపత్రాలు వెదజల్లారు. మావోయిస్టు ఉద్యమం తీరుతెన్నులు, పార్టీను ఉన్నత స్థితికి కారకులైన నాయకులు, ఉద్యమంలో అమరులైన మావోల గురించి స్థానికులకు తెలియజేసే విధంగా గ్రామసభలు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అమరులైన మావోలకు స్థూపాలు వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం పార్టీ ఎత్తుపల్లాలు గురించి చర్చించనున్నట్లు సమాచారం.
కూంబింగ్​ ముమ్మరం చేసిన పోలీసులు
గత ఏడాది మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు సందర్భంగానే అరుకులోయ మాజీ ఎమ్మెల్యేలు కిడారి, సివేరిలను మావోయిస్టులు హత్యచేశారు. ఈ ఏడాది అటువంటి ఘటనలకు తావివ్వకుండా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సరిహద్దులలో గ్రేహౌండ్స్, స్పెషల్, సీఆర్ఫీఎఫ్ పోలీసులను రంగంలోకి దింపింది.
బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్న సరిహద్దు ప్రజలు
నెల రోజుల వ్యవధిలోనే ఇన్ఫార్మర్లంటూ మావోయిస్టులు విశాఖ‌ ఏజెన్సీలో ముగ్గురు గిరిజనులను హతమార్చారు. దీంతో ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవానికి మూడు రోజులు ముందే మావోయిస్టులు ఏవోబీలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. అదేవిధంగా మావోయిస్టు ఉద్యమం గురించి తూర్పు-మల్కన్‌గిరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ ఆడియో టేపులు విడుదల చేసినందున సరిహద్దుల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
వారం రోజుల ముందు నుంచే పోలీసులు ఏజెన్సీలో నివసించే రాజకీయ నాయకులకు మైదాన ప్రాంతాలకు తరలిపోవలసిందిగా నోటీసులు జారీ చేశారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు,జి.మాడుగుల,డుంబ్రిగూడ, పెదబయలు, ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్ లకు అదనపు పోలీసు బలగాలను అధికారులు తరలించారు. సీలేరు జ‌ల‌విద్యుత్​ కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.

ఏవోబీలో మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details