ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకు లోయ @ 40 వేల మంది పర్యటకులు

వారాంతంలో విశాఖ జిల్లాలోని అరకు లోయ అందాలను తిలకించేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలుతున్నారు. కరోనా ఆంక్షలు ఉన్నా.. పర్యటకుల తాకిడి ఎక్కువగానే ఉంది. ఫలితంగా.. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నెలన్నర నుంచి అరకును సుమారు 40 వేల మంది సందర్శించారు. గిరిజన మ్యూజియంకు నెల రోజుల్లోనే సుమారు రూ. 12 లక్షల ఆదాయం సమకూరింది.

Araku Valley in Visakhapatnam District
అరకు లోయ @ 40 వేల మంది పర్యాటకులు

By

Published : Dec 21, 2020, 11:37 AM IST

విశాఖ జిల్లాలోని అరకు లోయ పర్యటకులతో కళకళలాడుతోంది. కరోనా భయం ఉన్నప్పటికీ.. వారాంతపు రోజుల్లో లోయ అందాలను తిలకించేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్న కారణంగా.. ఆ ప్రాంతమంతా సందడిగా కనిపిస్తోంది.

నెలన్నర నుంచి వారాంతపు రోజుల్లో సుమారు 40 వేల మంది పర్యటకులు అరకును సందర్శించిన కారణంగా.. అక్కడి అతిథి గృహాలు నిండిపోయాయి. ఫలితంగా.. సందర్శకులు టెంట్ల వంటి ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. నెల రోజుల్లో గిరిజన మ్యూజియంకి సుమారు రూ. 12 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details