పేదలకు మెరుగైన రేషన్ సరుకులు అందించేందుకు వైకాపా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని అరకు ఎంపీ మాధవి తెలిపారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. గతంలో పంపిణీ చేసిన సరుకుల కంటే మెరుగైన నాణ్యమైన రేషన్ సరుకులను జగన్మోహన్రెడ్డి హయాంలో అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభం.. - అరకు ఎంపీ మాధవి తాజా వ్యాఖ్యలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీని విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో అరకు ఎంపీ మాధవి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభించిన అరకు ఎంపీ మాధవి