సింహాచలం అప్పన్న సన్నిధిలో పవిత్రోత్సవాల్లో భాగంగా నేడు స్వామికి మహా పూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. ఉదయం నుంచి విశేష హోమాలు, పారాయణాలు జరిపారు. స్వామివారి దర్శనం నిలిపివేసి పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ఈవో ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పూర్తిచేశారు.
సింహాచలంలో పవిత్రోత్సవాలు సమాప్తం - visakha
సింహాచలం శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ముగిశాయి. స్వామివారికి పూర్ణాహుతి నిర్వహించారు.
సింహాచలం