ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాద్రి అప్పన్నకు వైభవంగా ఊంజల్ సేవ - unjal seva

విశాఖ సింహాచలంలో కొలువైన వరాహ లక్ష్మీనరసింహాస్వామికి ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

సింహాద్రి అప్పన్న

By

Published : Jul 20, 2019, 9:39 AM IST

సింహాద్రి అప్పన్నకు వైభవంగా ఊంజల్ సేవ

విశాఖలోని సింహాద్రి అప్పన్నకు ఉంజలసేవను కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారి దాసుడు ఒడిశాకు చెందిన లక్ష్మీకాన్తవనమాలికోదాస్ ఏడాదిలో 3నెలలపాటు స్వామిని సేవిస్తూ ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా శుక్రవారం ఊంజల్ సేవ నిర్వహించారు. స్వామివారిని శేషపాన్పుపై అధిష్ఠింప చేసి వివిధరకాల పుష్పలతో అర్చన చేశారు. ఆలయాన్ని అందంగా అలంకరించి స్వామిని డోలికల్లో ఉయ్యాల ఊపుతూ స్వామి కీర్తనలు ఆలపిస్తూ వైభవంగా నిర్వహించారు. డోలికలో స్వామిని చూసి భక్తులు పులకించిపోయారు. సింహగిరి అంతా నామస్మరణతో మారుమోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి సేవలో పాల్గొని తరించారు.

ABOUT THE AUTHOR

...view details