ఇవీ చూడండి:
విశాఖలో "ఆప్కో" నూతన చేనేత వస్త్రాలయం
విశాఖ వుడా కాంప్లెక్స్‌లో ఆప్కో నూతన చేనేత వస్త్రాలయాన్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆప్కో వస్త్రాలపై 30 శాతం ప్రత్యేక తగ్గింపును వినియోగదారులకు అందిస్తున్నట్లు వస్త్రాలయ యజమాని విశ్వేశ్వరరావు తెలిపారు. చేనేత కళాకారులుచే మగ్గంపై నేసిన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు, ఉప్పాడ, మంగళగిరి, బందరు, గద్వాల్, చీరాలతో పాటు డ్రెస్ మెటీరియల్స్, బెడ్ షీట్స్ ఆప్కో ద్వారా విక్రయిస్తున్నట్లు వివరించారు. అమెజాన్‌లో కూడ ఆప్కో వస్త్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.
విశాఖలో "ఆప్కో" నూతన చేనేత వస్త్రాలయం