విశాఖలోని శ్రద్ధ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి కేసుకు సంబంధించి కలెక్టర్ భాస్కర్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తిరుపతి రావు నేతృత్వంలో... కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున, జిల్లా ఆరోగ్య సమన్వయ అధికారి నాయక్‌లతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నేడు కేజీహెచ్‌లో సమావేశమైంది. ఈ కేసుకి సంబంధించిన విధివిధానాలపై చర్చించామని కమిటీ సభ్యుడు అర్జున తెలిపారు. వారం రోజుల్లో కలెక్టర్‌కు నివేదిక ఇస్తామన్నారు.
కిడ్నీ మార్పిడి కేసు.. విచారణకు త్రిసభ్య కమిటీ - కలెక్టర్ భాస్కర్
విశాఖలోని శ్రద్ధ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి కేసు విచారణపై కలెక్టర్ భాస్కర్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కేసుకి సంబంధించి విధివిధానాలపై కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నామని త్రిసభ్యకమిటీ సభ్యుడు అర్జున తెలిపారు.
కిడ్నీ మార్పిడి కేసు విచారణపై త్రిసభ్య కమిటీ