ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP CM Camp Office at Rushikonda: పూటకో మాట మారుస్తూ వచ్చారు.. ఎట్టకేలకు రుషికొండ నిర్మాణాలపై క్లారిటీ..! - రుషికొండలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం

AP CM Camp Office at Rushikonda: రుషికొండపై కోట్ల నిధులు కుమ్మరించారు. పర్యాటక రిసార్ట్ పునరుద్ధరణ పేరుతో పనులు మొదలు పెట్టి, ప్రస్తుతం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కేటాయించేలా అడుగులు వేస్తున్నారు. విశాఖలో ముఖ్యమంత్రి ఉండటానికి అక్షరాలా రూ. 270 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ఇంత భారీ ఖర్చు చూసి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోగొట్టడం అంటే ఇదేనా అంటూ ప్రజలు ముక్కున వేలేస్తున్నారు.

AP CM Camp Office at Rushikonda
AP CM Camp Office at Rushikonda

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 8:09 AM IST

Updated : Oct 12, 2023, 9:17 AM IST

AP CM Camp Office at Rushikonda: పూటకో మాట మారుస్తూ వచ్చారు.. ఎట్టకేలకు రుషికొండ నిర్మాణాలపై క్లారిటీ..!

AP CM Camp Office at Rushikonda: రుషికొండపై చేపడుతున్న నిర్మాణంపై ఎట్టకేలకు పర్యాటక ముసుగు తొలగింది. పర్యాటక రిసార్ట్ పునరుద్ధరణ పేరుతో మొదలు పెట్టిన నిర్మాణ పనులు.. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయానికి కేటాయించేలా అడుగులు వేస్తున్నారు. రుషికొండపై గతంలో పర్యాటక శాఖకు చెందిన దృఢంగా ఉన్న రిసార్టును కూలగొట్టారు. ఆ తర్వాత 2021 జనవరిలో APTDC 65 ఎకరాల్లో విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ‘సమీకృత పర్యాటక సముదాయం’ నిర్మిస్తున్నట్లు ప్రకటించి, ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానించారు.

ఈ భవన సముదాయంలో అతిథిగృహాలు, ఆడిటోరియం, కన్వెన్షన్‌ సెంటర్లు, భోజన హోటళ్లు, ఉల్లాస కేంద్రాలు, వినోద ప్రదర్శన కేంద్రాలు, క్రీడల నిర్వహణ ప్రాంతాలు.. ఇతర సౌకర్యాలు కల్పించాలని అందులో స్పష్టం చేశారు. ఆ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించినా స్పందన కనిపించలేదు. దీంతో టెండర్లను APTDC (Andhra Pradesh Tourism Development Corporation) ఉపసంహరించుకుంది. ఆపై వ్యూహాత్మకంగా 2021 జులై నెలలో రుషికొండ వద్ద రిసార్ట్ పునరుద్ధరణ పేరుతో పనులను అనుకున్నవారికి అప్పగించారు. ఇప్పటికి సుమారు రూ. 270 కోట్ల వరకు నిధులు రుషికొండపై కుమ్మరించారు.

Construction of Wall Around Rushikonda : నిబంధనలు ఉల్లంఘిస్తూ.. రుషికొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం..

సీఎం కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఆర్కిటెక్చర్లతో భవన నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు మొదలుకొని, అంతర్గత అలంకరణలు వరకు అన్ని పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. బయటకు మాత్రం ప్రభుత్వ ప్రాజెక్టులా చెప్పుకొంటూ వచ్చారు. ఏపీటీడీసీ బిల్డింగ్‌ ప్లాన్లను జీవీఎంసీకి సమర్పించగా.. అందులోని భవన నిర్మాణ ప్లాన్‌ అనుమతులకు, క్షేత్ర స్థాయిలో సీఎం సన్నిహితులైన ఆర్కిటెక్చర్ల సూచనతో జరుగుతున్న పనుల ప్లాన్లలో పూర్తి వ్యత్యాసం ఉన్నట్లు కనిపించింది.

దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అందుకు అనుగుణంగా ప్లాన్లను మార్పులు చేస్తూ వచ్చారు. రుషికొండ నిర్మాణాల గురించి అంతర్గత ఫొటోలు బయటకు రాకుండా, అక్కడ పనిచేసే సిబ్బంది, కార్మికుల నుంచి సెల్​ఫోన్లు తీసేసుకుని మరీ పనిలోకి పంపుతున్నారు. రుషికొండ వద్ద పనుల హడావిడి పెరిగింది. రుషికొండను తవ్వేసి చేపట్టిన నిర్మాణాలు తుదిదశకు చేరాయి. ప్రధాన ద్వారం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భవనాల ముందు నుంచి రోడ్డు నిర్మాణం సైతం పూర్తి చేశారు.

YSRCP Deleted Rushikonda Constrcutions Tweet: అంతా తూచ్​.. రుషికొండపై నిర్మిస్తోంది సచివాలయం కాదు..! వైసీపీ మరో ట్విట్​..

మాట మారుస్తూ వచ్చారు: నిన్న, మొన్నటి వరకు రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై మంత్రులు, అధికారులకు స్పష్టత లేదు. కేవలం సీఎం సన్నిహితులైన ఆర్కిటెక్చర్ల సూచనల మేరకే పనులన్నీ జరిగిపోతున్నాయి. కేవలం ముఖ్యమంత్రి సన్నిహితులైన ఆర్కిటెక్చర్ల సూచనల మేరకే పనులన్నీ జరిగిపోతున్నాయి. అప్పటి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో 7 స్టార్ హోటల్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఆ తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ గత సంవత్సరం చివరిలో రుషికొండపై భవనాలు కట్టకూడదా? అక్కడ ముఖ్యమంత్రి ఉండకూడదా? అంటూ మాట్లాడారు. ఆపై మంత్రి అమర్నాథ్‌ సైతం అక్కడ నిర్మాణాలు ప్రభుత్వ అవసరాల కోసమంటూ పేర్కొన్నారు. తర్వాత వైసీపీ అధికారిక ట్విటర్‌ ఖాతాలో సీఎం క్యాంపు కార్యాలయంగా రుషికొండ అంటూ వెబ్‌సైట్‌లో ఫొటోలతో సైతం ట్వీట్‌ (YSRCP Tweet on Rushikonda) చేశారు. ఇది వైరల్‌ కావడంతో ఆ తరువాత రోజే వాటిని తొలగించిన విషయం తెలిసిందే.

Rushikonda constructions కొనసాగుతున్న విధ్వంసం.. రుషికొండపై యథేచ్ఛగా నిర్మాణాలు

Last Updated : Oct 12, 2023, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details