ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చివరి క్షణంలో రైలు రద్దు... ప్రయాణికుల ఆందోళన

టిక్కెట్ తీసుకున్న ప్రయాణికులందరూ ఫ్లాట్​ఫాం మీద రైలు కోసం ఎదురుచూస్తున్నారు. కాసేపట్లో వస్తుందనగా రైలును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అప్పటివరకు వేచి ఉన్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

By

Published : Jun 14, 2019, 11:10 AM IST

నిలిచిన ఏసీ ఎక్స్​ప్రెస్


విశాఖపట్నం నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ఏపీ ఏసీ ఎక్స్​ప్రెస్​ను అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులందరూ ప్లాట్ ఫామ్ మీద ఎదురుచూస్తున్న సమయంలో రైలును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 8 గంటల 35 నిమిషాలకు విశాఖ నుంచి బయలుదేరాల్సి ఉన్నప్పటికి సమయం మించిపోతున్నా ప్లాట్ ఫామ్​కు తీసుకుని రాలేదు. పలుమార్లు ప్రయాణికులు విచారణ కేంద్రం చుట్టూ తిరుగుతున్నందున రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చివరి క్షణంలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించడమేంటని ప్రయాణికులు ఆందోళన చేశారు. అధికారులు మాత్రం రైలుకు ఉన్న రెండు జనరేటర్ పవర్ కార్లు విఫలమైనందున బోగీలో ఏసీ సరఫరా నిలిచిపోయిందని... అందుకే రైలును రద్దు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ప్రయాణికులకు టికెట్ డబ్బును తిరిగి వెనక్కి చెల్లించారు. అంతర్జాలంలో టికెట్ బుక్ చేసుకున్న వారికి ఐఆర్​సీటీసీ వెబ్సైట్ ద్వారా రీఫండ్​కు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details