ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ పరిధిలో జోడంభో, పనసపుట్, అండ్రాపల్లి పంచాయతీల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జోడంభో పంచాయతీలోని జంతురాయి గ్రామంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న మావోయిస్టులకు ప్రజలు ఎదురుతిరిగారు. గ్రామస్థుల దాడిలో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ప్రతీకారంగా ఆ గ్రామంలోని గిరిజనుల ఇళ్లకు, ద్విచక్ర వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టారు. ప్రస్తుతం మల్కన్‌గిరి జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు అక్కడి ఎస్పీ రిషికేశ్ డి కిలారి తెలిపారు.
గిరిజనులు ఎదురుతిరిగారు... మావోయిస్టులు నిప్పుపెట్టారు..!
ఒడిశాలోని జంతురాయి గ్రామంలో అభివృద్ధి పనులకు మావోయిస్టులు అడ్డువస్తున్నారని... అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఆ గ్రామంలోని గిరిజనుల ఇళ్లకు, ద్విచక్ర వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టారు.
మావోలకు ఎదురు తిరిగినందుకు నిప్పుపెట్టారు